Total Pageviews

Tuesday, December 28, 2010

vagalaadi lady.

కవ్వించి కాల్చేస్తుంది మురిపించి ముంచేస్తుంది
ప్రేమించి పీల్చేస్తుంది, పాతాళంలో పడదోస్తుంది పడతి,
ఊరంత ఉమ్మడి కుటుంబాన్నికుల్చేస్తుంది. నీ వారినే నీకు దూరం చేస్తుంది.
ఆడి తప్పేది ఆడది, మాట మర్చేదే మగువ ,పగలే చుక్కలు చూపించగల వగలాడి ఈ లేడీ .కలికాలపు మహిళకు మనసు లేదమో!!!

Sunday, December 26, 2010

Telugu Desam

తెలుగు దేశం తెలుగు దేశం తెలుగు తమ్ముల వెలుగు కోసం.
నీటి కోసం నాట్లు కోసం పాటు పడ్డ రైతు కోసం,
నేత గాని గీత గాని రాత మార్చే జాతి కోసం, తెలుగు బిడ్డల భవిత కోసం
తెలుగు తల్లి  కలం నుంచి జారు వాలిన కవితలా కదిలివచ్చెను తెలుగు దేశం.

enduku

జీవన వలయం లో శల్యమై డొక్కలెండిన బక్క జీవికి హక్కులెందుకు
మెతుకు దొరకని బతుకులెందుకు, కొలువు దొరకని చదువులెందుకు
నీడ నివ్వని  వాడలెందుకు, అండ ఉండని నేతలేందుకు.

Monday, November 1, 2010

thatvam

నా జీవన సాగరానికి లొతు తెలిపిన అనుబూతివి నువ్వు,నా మనొ సరాగనికి అనురాగం నువ్వు.
ఈ తత్వానికి అత్మియతవు నువ్వు,ఈ కవిత లొని బావనికి అనుభవానివి నువ్వు.

Tuesday, October 12, 2010

Paramaardham

నీ కవ్వించే చూపులు చూడని నా కన్నులు వ్యర్ధం,
నీ పడుచు పెదవిని పొగడని నా పలుకులు వ్యర్ధం,
నీ కౌగిలింతకు నే పరితపించుట అవ్వదు స్వార్ధం అది మన జీవిత పరమార్దం.

chupulu ...

తను నన్నుచూస్తుంటే దూరంగా అగాధం లో
నేను తనని చూస్తున్నాదగ్గరగా హృదయం లో

Tuesday, October 5, 2010

Nuvve naa nestham

మదురాతి మధురం నీ ఆదరం,బహు సుందరం  నీ వదనం.
నే వెల కట్టలేను నీ చిరు దరహాసం.కలకాలం నువ్వే నా నేస్తం.

lemi levaniyyani badugu jeevi ki thodu ra ra

ఓ బడుగు జీవి లేమి లేని లోకానికి కదలి రా ,
కలిమి బలిమి లేని నీ జీవితం కోసం  ,కదులుతున్నది ఈ కలం.కదం తోక్కును యువ గళం.

Naa palle ...

పాలు మరిచిన పిల్లగాన్నై పశుల కాసిన రోజులల్లో,
పాడి పశువుల కసువుకోసం పంట చేల్లోగెడ్డి కొస్తే,
పల్లె కాపులు ఉరుములు ఉరిమి పశుల మాదిరి తరిమి కొడితే.
దిక్కుతోచని నన్ను నువ్వు ఊరడించిన గురుతులెన్నో  ...

Monday, October 4, 2010

Madi lo medile ...

మాట మౌనమైతే | మనసు మూగ బోతే,
మమత మాసిపోతే | మదిలో మెదిలే నీ మదుర స్మృతులతో బతికేస్తా .

Pandistha nee adaram...

మునిపంటి ముద్దు తో పండిస్తా నీ ఆదరాన్ని
మురిపించి, మైమరపించి  దోచేస్తా నీ పరువాన్ని.

Chattam -Nyayam-Darmam

చట్టం- ఉన్న వానికిది చుట్టం లేనివానికి ఎన్నటికి తీరదు కష్టం.
అనాదిగా న్యాయానికి జరిగే ఈ అన్యాయం ..
ఎక్కడ ఉన్నది దర్మం. ఇలలో కలకాలం తిలకించాలా ఈ అధర్మం...

Nee tho nee

కుదురుకోదు నా హృదయం,చెరిగిపోదు నీ స్వప్నం.
కరిగిపోదు నీ ఫై అనురాగం,నీతోనే నా జీవనం  .

Nee kosam

క్షణక్షణం నిరీక్షణం !అనుక్షణం నీ స్మరణం !!

నీ కోసం నా జననం.నీ కోసం నా మరణం...

Naa Nechali

ప్రియాతి ప్రియతమ  ;అతిలోక  అందమా,
మరుపు రాని నేస్తమా ; మరువలేని బందమా.